మళ్ళీ తడబడిన భారత్ నాగపూర్ : ఫాలో ఆన్ ఆడుతున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనూ తడబాటునే ప్రదర్శించింది. భారత ఓపెనింగ్స్ బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ కేవలం ఒక్క పరుగుకు, మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 16 పరుగులకు తమ వికెట్లను సౌతాఫ్రికాకు సమర్పించుకొని పెవిలియన్ చేరుకున్నారు. ఈ రెండు వికెట్లలో సెహ్వాగ్ వికెట్ ను తొలి ఇన్నింగ్స్ లో హీరో డేల్ స్టేయిన్ తీసుకున్నాడు. గంభీర్ వికెట్ మోర్న్ మోర్కెల్ కు దక్కింది.
భారత్ లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటనలో భాగంగా ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఇంకా 259 పరుగులు వెనుకబడి పీక లోతు కష్టాల్లో ఉంది. ఒన్ డౌన్ మురళీ విజయ్ 27 పరుగులతోను, టూ డౌన్ సచిన్ టెండుల్కర్ 15 పరుగులతోను నైట్ వాచ్ మెన్ గా నిలిచారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 558 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకే కుప్పకూలిపోయి ఫాలో ఆన్ ఆడుతోంది.
News Posted: 8 February, 2010
|