'కింగ్స్'ను అమ్మేసిన ప్రీతీ న్యూఢిల్లీ : పంజాబ్ కింగ్స్ హీరోహోండా చేతిలో పడ్డారు. ఇప్పటివరకు బాలీవుడ్ తార ప్రీతీజింటా అధీనంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోహోండా కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు జట్లను అమ్మకం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నయంటూ కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ జట్టులోని కొంత షేర్ ను అమ్మకానికి పెట్టగా బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి కొనుగోలు చేసింది. ఫ్రాంచైజీలోని 12 శాతం షేర్ ను శిల్పా కొనుగోలు చేసింది. ఈ లావాదేవీల వ్యవహారాన్ని ఎవరూ ధృవీకరించడం లేదు. అయితే ఇపుడు తాజాగా పంజాబ్ కింగ్స్ XI జట్టును ప్రీతీ జింటా, మిగతా యజమానులైన నెస్ వాడియా, మోహిత్ బర్మన్, కరణ్ పాల్ అమ్మకానికి పెట్టారు. దీనిని ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థ హీరోహోండా 260 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ చేతుల మారిన తొలి ఫ్రాంఛైజీగా నిలిచింది. ఐపీఎల్ త్రీలో శ్రీలంక సారథి కుమార సంగక్కర నేతృత్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు మార్చి 13న ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడనుంది.
News Posted: 10 February, 2010
|