ఈడెన్ టెస్టుకు లక్ష్మణ్ న్యూఢిల్లీ : చేతి వేలి గాయం నుండి హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మెన్ వి వి ఎస్ లక్ష్మణ్ పూర్తిగా కోలుకున్నాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ లోలక్ష్మణ్ ఆడనున్నాడు. గత నెలలో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సీరీస్ లో చేతి వేలికి గాయం కావడంతో లక్ష్మణ్ ఆ సీరీస్ కు దూరమయ్యాడు. ఈ కారణంగా దక్షిణాఫ్రికా తో జరుగుతున్న సీరీస్ కు మిస్సయ్యాడు. ఇప్పుడు లక్ష్మణ్ గాయం నుండి పూర్తిగా కోలుకున్నాడని, చేతి వేలి గాయం నయమైందని, కచ్చితంగా ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ ఆడుతాడని క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మీడియాతో చెప్పారు. టెస్టుల్లో లక్ష్మణ్ కు విశేష అనుభవం ఉంది.109 మ్యాచ్ లలో 14 సెంచరీలు చేసి 6,993 పరుగులు సాధించాడు. సీరీస్ ను సమం చేసి ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీమ్ ఇండియాకు ఈ రెండో టెస్టు కీలకంగా మారింది. లక్ష్మణ్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉంటే జట్టుకు మేలు జరిగే అవకాశం ఉంది.
భారత జట్టు సభ్యులు వీరే :
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, మురళీ విజయ్, సచిన్ టెండుల్కర్, వింకటసాయి లక్ష్మణ్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, జహీర్ ఖాన్, శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, దినేష్ కార్తీక్, సురేష్ రైనా.
News Posted: 11 February, 2010
|