రవీంద్ర జడేజాపై వేటు న్యూఢిల్లీ : రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రికెటర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ నుండి ఓ ఏడాది పాటు బహిష్కరణకు గురయ్యాడు. ఐపీఎల్ నియమ, నిబంధనలు ఉల్లంఘించినందుకు జడేజాపై ఈ వేటు పడింది. మార్చి నెలలో జరిగే ఐపీఎల్ త్రీ మ్యాచ్ లకు జడేజా దూరంగా ఉండాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉండగానే, వేరే ఫ్రాంఛైజీలో చేరేందుకు రవీంద్ర జడేజా బేరాలు సాగించడం ద్వారా నియమాలను ఉల్లంఘించాడని ఐపిఎల్ నిర్ధారించి బహిష్కరణ వేటు వేసింది. ఇపీఎల్ నియమ, నిబంధనల ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్రాంఛైజీ నుండి అనుమతి పొంది వేరే ఫ్రాంఛైజీలో చేరవచ్చు. అలాగే ముందుగా అనుమతి పొంది ఫ్రాంఛైజీ నుండి బయటకు వెళ్లిపోవచ్చు. ఈ నిబంధనలు ఉల్లంఘించి జడేజా రాజస్థాన్ రాయల్స్ లో ఉంటూనే వేరే ఫ్రాంఛైజీలతో బేరసారాలు నిర్వహించాడని తేలింది. దీంతో జడేజాను ఓ ఏడాది పాటు ఐపీఎల్ మ్యాచ్ ల నుండి బహిష్కరించారు.
News Posted: 13 February, 2010
|