ఎగిరిపోయిన ఐపీఎల్ న్యూఢిల్లీ : రాష్ట్రంలోని క్రికెట్ అభిమానులు నిరాశపరిచేలా ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో జరగాల్సిన ప్రారంభ ఉత్సవాలనే కాకుండా రాష్ట్రంలో జరగాల్సిన అన్ని మ్యాచ్ లకు తరలించింది. విశాఖ, హైదరాబాద్ లలో జరగాల్సిస ఏడు మ్యాచ్ లను నాగ్ పూర్, ముంబయిలలో నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. తెలంగాణ ఉద్యమం కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించినందున మ్యాచ్ లను వేరే ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. అయితే రాష్ట్రం నుండి మ్యాచ్ లను తరలించవద్దంటూ ముఖ్యమంత్రి రోశయ్య, క్రీడాశాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాసిన లేఖలను ఇటు కేంద్ర మంత్రి పవార్ గానీ, ఇటు ఐపీఎల్ పట్టించుకోలేదు, మరోవైపు దక్కన్ ఛార్జర్స్ మ్యాచ్ కు టికెట్ల విక్రయాన్ని సోమవారం నుండి ప్రారంభించాలని నిర్ణయించింది.
News Posted: 13 February, 2010
|