కనీసం నాలుగైనా..? హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ మ్యాచ్ లు హైదరాబాద్ నుంచి తరలిపోతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పరువు నిలుపుకునే యత్నంగా రాష్ట్రంలో జరగవలసి ఉన్న ఏడు ఐపిఎల్ మ్యాచ్ లలో కనీసం నాలుగింటినైనా మిగుల్చుకోవాలని ఆరాటపడుతోంది. నాలుగు గేములను ముంబైకి తరలించిన ఐపిఎల్ పాలక మండలి ప్రారంభోత్సవ కార్యక్రమం మినహా మూడు పోటీలను ఈ కల్లోలిత నగరం హైదరాబాద్ నుంచి మార్చాలని ఇప్పుడు యోచిస్తున్నది. శనివారం పుణెలో ఉగ్రవాదుల దాడి అనంతరం డక్కన్ చార్జర్స్ గేములకు మరొక వేదికగా భువనేశ్వర్ ను నిర్ణయించడంపై చర్చలు జరుగుతున్నాయి. భువనేశ్వర్ మూడు గేములకు ఆతిథ్యం ఇవ్వవచ్చు. మిగిలిన మూడు గేములను నాగపూర్ లో నిర్వహించవచ్చు.
'నేను శరద్ పవార్ తో మాట్లాడి, పరిస్థితిని ఆయనకు వివరించాను. హైదరాబాద్, విశాఖపట్నంలలో కనీసం రెండేసి పోటీలను నిర్వహించేట్లుగా ప్రయత్నిస్తున్నాం' అని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. ఈ విషయంలో మంత్రి ఆశాభావంతో ఉన్నారు. కాని పాలక మండలి నిర్ణయం సోమవారం సాయంత్రం మాత్రమే తెలియరాగలదు. రాష్ట్రంలో మ్యాచ్ లు సాఫీగా సాగిపోయేట్లుగా తెలంగాణ జెఎసి సహకారం లభించగలదని వెంకటరెడ్డి తిరిగి భరోసా ఇచ్చారు.
News Posted: 15 February, 2010
|