భారత్ 342/5 కోల్ కతా : ఈడెన్ గార్డెన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండోరోజు సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు నష్టపోయి 342 పరుగులు చేసింది. దీనితో దక్షిణాఫ్రికా కంటే భారత్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ి వివిఎస్ లక్ష్మణ్ 9, అమిత్ మిశ్రా ఒక్క పరుగుతోను క్రీజ్ వద్ద ఉన్నారు. అంతకు ముందు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 165, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 106 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద ఔటయ్యారు. సచిన్ టెండుల్కర్ ఔటైన తరువాత బరిలోకి వచ్చిన ఎస్. బద్రీనాథ్ 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్ లో డేల్ స్టేయిన్, మోర్న్ మార్కెల్, పాల్ హారిస్, జె.పి. డుమిని తలో వికెట్ తీసుకున్నారు.
News Posted: 15 February, 2010
|