లక్ష్మణ్, ధోనీ సెంచరీలు కోల్ కతా : దక్షిణాఫ్రికా జట్టుతో ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడోరోజు మంగళవారం మధ్యాహ్నం టీమిండియా క్రీడాకారుడు, హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్ మన్ వివిఎస్ లక్ష్మణ్, కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చెరో సెంచరీ చేశారు. కాగా ఈడెన్ గార్డెన్ లో లక్ష్మణ్ కు ఇది నాలుగో సెంచరీ. లక్ష్మణ్ టెస్ట్ కెరీర్ లో ఇది 17వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ వార్త రాసే సమయానికి లక్ష్మణ్ 129 పరుగులతోను, ధోని 100 పరుగులతోను బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా, దక్షిణాఫ్రికా కంటే 300 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేసింది.
News Posted: 16 February, 2010
|