చార్జర్స్ ఆడతారు: లలిత్ న్యూఢిల్లీ : ట్వంటీ20 చాంపియన్స్ ట్రోఫీ ట్రోర్నమెంట్ లో డక్కన్ చార్జర్స్ ఆడి తీరుతుందని, టోర్నీ నుంచి ఆ ప్రాంచైజీ తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమిషనర్ లలిత్ మోడి ప్రకటించారు. డక్కన్ చార్జర్స్ ఆడటం లేదు.. ఎక్స్ వై జెడ్ టీం లు తప్పుకున్నాయి అని వస్తున్న వార్తలను పట్టించుకోనవసరం లేదని లలిత తన ట్విట్టర్ లో మంగళవారం నాడు పేర్కొన్నారు. టోర్నీలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయని, ఆమేరకు తాను పూర్తి హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు.
హైదరాబాద్ నుంచి ప్రారంభోత్సవాలతో సహా నాలుగు మ్యాచ్ లను, వైజాగ్ లో జరగాల్సిన రెండు మ్యాచ్ లను నావీ ముంబయికి, నాగ్ పూర్ కి తరలించిన నేపధ్యంలో డక్కన్ చార్జర్స్ యాజమాన్యం ఐపిఎల్ గవర్నింగ్ కమిటీకి, బిసిసిఐకి లీగల్ నోటీసులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాము టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. ఇది జరిగిన రెండు రోజులకు లలిత్ మోడి స్పందించారు. ఐపిఎల్ మూడో ఎడిషన్ ట్వింటీ20 చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ డక్కన్ చార్జర్స్ పాల్గొంటుందని ఆయన స్పష్టం చేశారు.
News Posted: 16 February, 2010
|