వానా వానా అడ్డం వచ్చె కోల్ కతా : దక్షిణాఫ్రికా - టీమిండియా జట్ల మధ్య ఇక్కడి ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటను వరుణదేవుడు ఆటంకపరిచాడు. కోల్ కతానగరంలో మంగళవారం రాత్రి కురిసిన వాన కారణంగా మైదానం చిత్తడిగా మారింది. దీనితో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్ ఉదయం 10.30 గంటలకు మొదలవుతుందని వారు ప్రకటించారు. మ్యాచ్ సమయం తగ్గిపోవడంతో ఓవర్లను కూడా 82.1 ఓవర్లకు కుదించారు. తొలి టెస్ట్ మ్యాచ్ ను దక్షిణాఫ్రికాకు జారవిడుచుకున్న భారత్ ఇప్పుడు ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలని, ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నానికి వాన అడ్డంకిగా మారింది. 337 పరుగులు వెనుకబడి ఉన్న దక్షిణాఫ్రికా గ్రేమ్ స్మిత్ 9, అల్విరో పీటర్సన్ 1 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.
News Posted: 16 February, 2010
|