జైపూర్ వన్డేకు టెర్రర్ బెల్ జైపూర్ : ఈ నెల 21న ఇక్కడి సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో దక్షిణాఫ్రికా - టీమిండియా జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్ కు ఉగ్రవాదుల బెడద వచ్చిపడింది. జైపూర్ మ్యాచ్ కు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో మాన్ సింగ్ స్టేడయం వద్ద ఇప్పటి నుంచి భద్రతను కట్టుదిట్టం చేశారు. జైపూర్ వెళ్ళే అన్ని రహదారులను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మన దేశంలోనే జరగనున్న ప్రపంచ హాకీ కప్, కామన్వెల్త్ గేమ్స్ పైన కూడా టెర్రరిస్టుల కన్ను పడినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి.
News Posted: 18 February, 2010
|