వన్డే సీరీస్ కు స్మిత్ దూరం కోల్ కతా : భారత్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. భారత్ తో జరిగే వన్డే సీరీస్ కు జట్టు కెప్టెన్ గ్రేమీ స్మిత్ దూరమయ్యాడు. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో స్మిత్ చేతి వేలికి గాయమైంది. దీంతో ఆదివారం నుండి ప్రరాంభమయ్యే వన్డే సీరీస్ కు స్మిత్ దూరమవుతున్నాడని ఆ జట్టు మేనేజర్ మైఖేల్ వెల్లడించారు.
చేతి వేలి గాయం నయం కావడానికి 10 రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా స్మిత్ కు వైద్యులు సూచించారని ఆయన పేర్కొన్నారు.స్మిత్ స్థానంలో టెస్టు ఆటగాడు హసీమ్ అమ్లా వన్డే సిరీస్ లో ఆడనున్నాడుని ప్రకటించారు. అయితే వన్డే సీరీస్ కు సారథ్య బాధ్యతలను ఆల్ రౌండర్ జాక్వస్ కల్లీస్ చేపడతాడని మేఖేల్ మీడియాతో చెప్పారు.వన్డే సిరీస్ లో భాగంగా ఈ నెల 21న జైపూర్ లోనూ, 24న గ్వాలియర్ లోనూ, 27 అహ్మదాబాద్ లోనూ మ్యాచ్ లు జరగనున్నాయి.
News Posted: 18 February, 2010
|