టాస్ గెలిచిన సౌతాఫ్రికా
జైపూర్ : దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారతదేశంలో దక్షిణాఫ్రికా జట్టు పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సీరీస్ లో తొలి వన్డే (డే/నైట్) ఇక్కడి సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ సీరీస్ చేజిక్కించుకున్న జట్టు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సాధిస్తుంది. ఇప్పటికే రెండో స్థానంలో ఉన్న భారత్ సీరీస్ గెలిచి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు, ఎలాగైనా ఈ సీరీస్ సాధించి మూడు నుంచి రెండో స్థానంలోకి ఎదగాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా తమ వ్యూహాలు, బలగాలను ఒడ్డి పోరాటం చేయనున్నాయి.
గాయాల కారణంగా గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, సొంత పనుల మీద హర్భజన్ సింగ్ ఈ సీరీస్ దూరంగా ఉన్నారు. అలాగే చేతి వేలికి తగిలిన గాయం వల్ దక్షిణా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సీరీస్ కు దూరమయ్యాడు. దీనితో జాక్విస్ కలిస్ కు కెప్టెన్సీ బాధ్యతలను సౌతాఫ్రికా అప్పగించింది. రెండు జట్లలోనూ కీలక ఆటగాళ్ళు లేకుండా ఈ సీరీస్ జరుగుతోంది. టీమిండియా బ్యాట్స్ మెన్ పైనే తీవ్రంగా ఆశలు పెట్టుకుంది. దక్షిణాఫ్రికా జట్టుకు మిడిలార్డర్ బలహీనంగా ఉంది. టెస్ట్ సీరీస్ లో బాగా రాణించిన హషిం ఆమ్లా ఒక్కడే భారత జట్టును ఇబ్బందుల పాలు చేసే అవకాశాలున్నాయి.
జట్లు వివరాలు :
దక్షిణాప్రికా : హెర్చెల్లీ గిబ్స్, లూట్స్ బోస్మన్, జాక్విస్ కల్లిస్ (కెప్టెన్), ఎబి డి విల్లియర్స్, అల్విరో పీటర్సన్, అల్బీ మోర్కెల్, మార్క్ బౌచర్ (కీపర్), జాన్ బోథా, వేయిన్ పార్నెల్, డేల్ స్టేయిన్, కార్ల్ లాంగ్వెల్ట్.
భారత్ : వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లి, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్ / కీపర్), సురేష్ రైనా, దినేష్ కార్తీక్, యూసఫ్ పఠాన్, రవీంద్ర జడేజా, ప్రవీణ్ కుమార్, ఆశిష్ నెహ్రా, ఎస్. శ్రీశాంత్.
News Posted: 21 February, 2010
|