గ్వాలియర్ : రెండో వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్వాలియర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ ధోనీ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. మూడు వన్డేల ఈ సిరీస్ లో జైపూర్ లో జరిగిన తొలి మ్యాచ్ ను భారత్ కైవశం చేసుకుంది. దీంతో 1-0 తేడాతో సిరీస్ లో ఆధిక్యం కనబరుస్తోంది. రెండో వన్డే లో కూడా నెగ్గి సిరీస్ ను కైవశం చేసుకోవాలని టీమ్ ఇండియా తహతహలాడుతోంది. ఈ సిరీస్ ను నెగ్గితే ఐసీసీ ర్యాంకింగ్స్ లో ద్వితీయ స్థానానికి చేరుకోవాలని భారత్ యోచిస్తోంది.