సచిన్ 46వ సెంచరీ గ్వాలియర్ : భారత జట్టు చిచ్చరపిడుగు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరోసారి చెలరేగిపోయాడు. ఇక్కడి కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక రెండో వన్డేలో టెండుల్కర్ 90 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. సచిన్ టెండుల్కర్ వన్డే కెరీర్ లో ఇది 46వ సెంచరీగా నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టుపైన ఇది సచిన్ చేసిన నాలుగో సెంచరీ కాగా, గ్వాలియర్ స్టేడియంలో అతనికిది రెండో సెంచరీగా నమోదైంది. కేవలం 30 ఓవర్లలోనే టీమిండియా బ్యాట్స్ మెన్ 200 పరుగులు చేయడం రికార్డు. రెండో వికెట్ కు సచిన్ టెండుల్కర్ - దినేష్ కార్తీక్ 210 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
News Posted: 24 February, 2010
|