సచిన్ కు విశ్రాంతి న్యూఢిల్లీ : అద్భుతమైన, అనితరసాధ్యమైన రికార్డులతో హోరెత్తిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మూడో వన్డే మ్యాచ్ లో ఆడకపోవచ్చు. రెండో వన్డేలో 200 రికార్డు పరుగులు చేసిన సచిన్ ప్రపంచ క్రీడాకారుల, ప్రముఖుల ప్రశంసల వర్షంలో తడుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్ ను ఇప్పటికే టీమిండియా గెలుచుకోవడంతో లాంఛనప్రాయంగా మారిన మూడో వన్డేలో సచిన్ కు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ ఆటగాళ్ళ సామర్ధ్యాన్ని పరీక్షించాలని బిసిసిఐ భావిస్తోంది. అందువలన అహ్మదాబాద్ లో ఈ నెల 27 న జరగి ఆఖరి మ్యాచ్ లో సచిన్ బ్యాటింగ్ చూసే అవకాశం లేదు. గురువారం చెన్నైలో సమావేశమయ్యే జాతీయ సెలక్టర్లు 2011లో జరిగే వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేయనున్నారు. అలానే దక్షిణాఫ్రికాతో మూడో వన్డే ఆడే జట్టును కూడా ప్రకటిస్తారు.
News Posted: 25 February, 2010
|