సౌతాఫ్రికా బ్యాటింగ్ అహ్మదాబాద్ : దక్షిణాఫ్రికా - భారత క్రికెట్ జట్ల మధ్య ఇక్కడి మొతెరా సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి మూడో వన్డే (డే & నైట్)లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకుంది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సీరీస్ భారత్ ఇప్పటికే 2 - 0 తేడాతో సీరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఖరి వన్డే అయినా గెలిచి పరువు దక్కించుకోవాలన్న నిశ్చయంతో దక్షిణాప్రికా, మూడో వన్డే కూడా నెగ్గి దక్షిణాఫ్రికాను స్వీప్ చేయాలన్న ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతున్నాయి. మూడో వన్డేలో ఆడే భారత జట్టులో ఆశిష్ నెహ్రా, అజయ్ మిశ్రా, అశ్విన్ లకు స్థానం లభించలేదు. లూట్స్ బోస్మన్ - హషిం ఆమ్లలతో దక్షిణాఫ్రికా తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
జట్ల వివరాలు :
భారత్ : దినేష్ కార్తీక్, మురళీ విజయ్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్ / కీపర్), రోహిత్ శర్మ, సురేష్ రైనా, యూసఫ్ పఠాన్, రవీంద్ర జడేజా, ఎస్. శ్రీశాంత్, అభిమన్యు మిథున్, సుదీప్ త్యాగి.
దక్షిణాఫ్రికా : హషిం ఆమ్ల, లూట్స్ బోస్మన్, జాక్విస్ కల్లిస్ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, హెర్చెల్లి గిబ్స్, మార్క్ బౌచర్ (వికెట్ కీపర్), జాన్ బోథా, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, మోర్న్ మోర్కెల్, డేల్ స్టేయిన్, లాన్వాబో సాట్సోబ్.
News Posted: 27 February, 2010
|