చుక్కలు చూపిన విలియర్స్ అహ్మదాబాద్ : భారత బౌలర్లకు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ ఎబి డి విలియర్స్ పట్టపగలే చుక్కలు చూపించాడు. 59 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, 11 బౌండరీల సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ కూడా అజేయ సెంచరీ (104 పరుగులు) చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ లూట్స్ బోస్మన్ 68 (46 బంతుల్లో 4 సిక్సర్లు, 7 బౌండరీలతో), హషిం ఆమ్ల 87 (103 బంతుల్లో 8 ఫోర్లతో) పరుగులు చేశారు. రెండు లెగ్ బైలు, మరో రెండు నో బాల్ పరుగులలతో కలిపి మొత్తం దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. టీమిండియా ముందు 366 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లోని మొతెరా సర్దార్ పటేల్ స్టేడియంలో ఆతిథ్య భారత జట్టుతో జరుగుతున్న చివరి మూడో వన్డేలో భారత్ ముందు భారీ లక్ష్యమే ఉంచింది.
ఈ సీరీస్ ను టీమిండియా ఇప్పటికే 2 - 0 తేడాతో గెలుకున్నది. చివరి వన్డే కూడా గెలిచి దక్షిణాఫ్రికాను స్వీప్ చేయాలని చూస్తున్న భారత్ కు దక్షిణాఫ్రికా చివరి వన్డే అయినా నెగ్గి పరురువు నిలుపుకోవాలన్న కృతనిశ్చయంతో ఆడుతోంది. భారత జట్టుకు ఈ వన్డే లాంఛనమే. ఈ మ్యాచ్ కూ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు దూరంగా ఉన్నారు. ఈ వన్డే ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లా పాఠాలు నేర్చుకునేందుకు యువ క్రికెటర్లకు జట్టు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. భారత బౌలింగ్ లో రవీంద్ర జడేజా, యుసఫ్ పఠాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
News Posted: 27 February, 2010
|