స్ఫూర్తిలోనూ సచినే బెస్ట్ ముంబయి : డబుల్ సెంచరీ ధమాకాతో ఖుషీగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తాజాగా మరో ఘనత సాధించాడు. భారత క్రీడా రంగంలో అత్యంత స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో నెంబర్ వన్ గా నిలిచాడు. భారత క్రీడా రంగంలో అత్యంత స్ఫూర్తిదాయక నిలుస్తున్న వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. 50 మంది వ్యక్తులతో కూడిన ఈ జాబితాలో సచిన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. సచిన్ తర్వాత స్థానాన్ని ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ దక్కించుకున్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్య ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బీసీసీఐ అధ్యక్షుడు శంశాక్ మనోహర్ లు వరసగా నిలిచారు. 50 మందితో కూడిన స్ఫూర్తిదాయక వ్యక్తుల జాబితాలో టెన్నీస్ సంచలనం సానియామీర్జా అట్టడుగు స్థానంలో నిలిచింది. ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రా 41వ స్థానంలోనూ, చర్చిల్ టీమ్ యజమాని చర్చిల్ ఆలిమావో 48వస్థానంలో, డెంపో స్పోర్ట్స్ టీమ్ యజమాని శ్రీనివాస్ డెంపో 49 స్థానాలకు పరిమితమయ్యారు.
స్ఫూర్తిదాయక వక్తుల్లో అగ్రస్థానంలో నిలిచిన సచిన్ మాట్లాడుతూ, దేశం కోసం తాను ధృడసంకల్పంతో ఆడుతున్నానని చెప్పాడు. ఇటీవల తాను సాధించిన డబుల్ సెంచరీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, ఇప్పటికీ తన సెల్ ఫోన్ కు విషెస్ మెసేజ్ లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేసాడు.
News Posted: 9 March, 2010
|