పాక్ క్రికెట్ జట్టు ప్రక్షాళన ఇస్లామాబాద్ : బ్యాల్ ట్యాంపరింగ్ వివాదం పాకిస్తాన్ క్రికెట్ జట్టును తీవ్రంగా కుదిపేసింది. ట్యాంపరింగ్ వివాదానికి సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు కొరడా ఝుళిపించింది. మొత్తం జట్టును ప్రక్షాళన చేసేందుకు పాక్ క్రికెట్ బోర్డు ఉపక్రమించింది. క్రికెటర్లపై అత్యంత కఠిన చర్యలు చేపట్టింది. పలువురు క్రికెటర్లపై వేటు వేసింది. జట్టులోని సభ్యులైన యూసఫ్ ఖాన్, యూనిస్ ఖాన్ లను జీవితకాలం పాటు నిషేధం విధిస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అలాగే షోయబ్ మాలిక్, రాణాలపై వేటు వేసింది. వీరిద్దరినీ ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. షోయబ్ మాలిక్, అక్మల్ లకు భారీ జరిమానా విధించింది.
News Posted: 10 March, 2010
|