ముంబై ఇండియన్స్ విజయం ముంబై: ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. 20 ఓవర్లలలో 212/6 పరుగులు చేసింది. రాజస్థాన్స్ రాయల్స్ 20 ఓవర్లులలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి కేవలం 4 పరుగుల తేడాలో పరాజయం పాలైంది.
రాయల్స్ ఆల్ రౌండర్ శారు. యూసుఫ్ పఠాన్ 37 బంతులలో (9×4 , 8×6 ) 100 పరుగులు సాధించి వీరవిహారం చేసినప్పటికీ తన జట్టు విజయం సాధించలేకపోయింది. ఐపీఎల్‌లో -3 తొలి సెంచరీ పఠాన్ దే కావడం విశేషం. 4 పరుగుల తేడాతో ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. దోగ్రా 41, పఠాన్ 100 , చివరిలో ఇద్దరూ రన్‌అవుట్ కావడంతో మ్యాచ్ ముంబయి ఇండియన్స్ దక్కింది.
News Posted: 13 March, 2010
|