కాంగ్రెస్ లో 'స్లేవ్ కల్చర్'
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ నాయకుడు కల్యాణ్ సింగ్ తో సంబంధాలు పెట్టుకోవడంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తుండడంతో సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) ఈ సమస్యకు కొందరు కాంగ్రెస్ నాయకులు 'ఆజ్యం పోస్తున్నారు' అని శనివారం ఆరోపించింది. అయితే, ఆ పార్టీతో పొత్తును తెంచుకోబోమని ఎస్ పి స్పష్టం చేసింది. 'వారు (కొందరు కాంగ్రెస్ నాయకులు) కల్యాణ్ సమస్యను పెద్ద వివాదం చేస్తున్నారు. దీనిని భూతద్దంలో చూపిస్తూ పెంచి పెద్దది చేస్తున్నారు' అని ఎస్ పి ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ 'సిఎన్ఎన్-ఐబిఎన్' చానెల్ 'డెవిల్స్ అడ్వొకేట్' కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 14 February, 2009
|