కన్నా కోటలో 'మెగా'షో
క్రోసూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి-క్రోసూరు మధ్య 20 కిలోమీటర్ల రోడ్డు పొడవునా శుక్రవారం ఉదయం జనాలు బారులు తీరి ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు. రోడ్డుకిరువైపులా యువజనం ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయారు. మహిళలు హారతిపళ్లాలు, కొబ్బరికాయలు పట్టుకుని గంటల తరబడి ఎదురుచూశారు. చివరకు చిరునవ్వులు చిందిస్తూ, చేతులూపుతూ చిరంజీవి రాగానే ఆ ప్రాంతమంతా 'చిరంజీవి జిందాబాద్', 'మెగాస్టారం చిరంజీవి' అనే నినాదాలతో ప్రతిధ్వనించింది.క్షణాల్లో వందలాది కొబ్బరికాయలు చిరు రథంముందు బద్దలయ్యాయి. మహిళలంతా పరుగున వెళ్లి ఆయనకు హారతులిచ్చారు. ఇంత ఆదరణతో ఉక్కిరిబిక్కిరైన మెగాస్టార్ రాష్ట్రంలోని ఓటర్లలో మహిళలే తనకు కొండంత అండ అని వారి ఆశీస్సులు తన వెంట ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.
రాష్ట్ర మంత్రి, కాపు నాయకుడు కన్నా లక్షీనారాయణ ఇలాకాలో శుక్రవారం సాయంత్రం మెగా షో సూపర్ హిట్ అయింది. ఎర్రబాలెం, క్రోసూరు, విప్పర్ల , బయ్యారం, మునుగోడు గ్రామాల్లో చిరంజీవి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గుంటూరి జిల్లాలో ఆయన ఐదురోజుల ప్రజాయాత్ర రాత్రి పొద్దుపోయాక అమరావతి సభతో ముగిసింది. మంత్రి కన్నా నియోజకవర్గం పెదకూరపాడులోని మండల కేంద్రం క్రోసూరుకు మధ్యాహ్నానికే ఇసుకవేస్తే రాలనంతగా జనం చేరుకున్నారు.
చిరు షో ఫ్లాప్ అవడం ఖాయమనుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు జనసంద్రాన్ని చూసి అవాక్కయ్యారు. ఎర్రబాలెం-క్రోసూరు మెయిన్ రోడ్డు, క్రోసూరు పట్టణం చిరంజీవి అభిమానులు, యువజనాలతో కిక్కిరిసిపోయాయి. గత 30 సంవత్సరాల్లో ఇంతటి జనవాహినిని ఎన్నడూ చూడలేదని స్థానిక వ్యాపారి రామకోటేశ్వరరావు చెప్పారు. ఆఖరికి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా ఇంతమంది జనం రాలేదన్నారు. కన్నా కోటలో 'మెగా'షో
క్రోసూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి-క్రోసూరు మధ్య 20 కిలోమీటర్ల రోడ్డు పొడవునా శుక్రవారం ఉదయం జనాలు బారులు తీరి ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు. రోడ్డుకిరువైపులా యువజనం ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయారు. మహిళలు హారతిపళ్లాలు, కొబ్బరికాయలు పట్టుకుని గంటల తరబడి ఎదురుచూశారు. చివరకు చిరునవ్వులు చిందిస్తూ, చేతులూపుతూ చిరంజీవి రాగానే ఆ ప్రాంతమంతా 'చిరంజీవి జిందాబాద్', 'మెగాస్టారం చిరంజీవి' అనే నినాదాలతో ప్రతిధ్వనించింది.క్షణాల్లో వందలాది కొబ్బరికాయలు చిరు రథంముందు బద్దలయ్యాయి. మహిళలంతా పరుగున వెళ్లి ఆయనకు హారతులిచ్చారు. ఇంత ఆదరణతో ఉక్కిరిబిక్కిరైన మెగాస్టార్ రాష్ట్రంలోని ఓటర్లలో మహిళలే తనకు కొండంత అండ అని వారి ఆశీస్సులు తన వెంట ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.
రాష్ట్ర మంత్రి, కాపు నాయకుడు కన్నా లక్షీనారాయణ ఇలాకాలో శుక్రవారం సాయంత్రం మెగా షో సూపర్ హిట్ అయింది. ఎర్రబాలెం, క్రోసూరు, విప్పర్ల , బయ్యారం, మునుగోడు గ్రామాల్లో చిరంజీవి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గుంటూరి జిల్లాలో ఆయన ఐదురోజుల ప్రజాయాత్ర రాత్రి పొద్దుపోయాక అమరావతి సభతో ముగిసింది. మంత్రి కన్నా నియోజకవర్గం పెదకూరపాడులోని మండల కేంద్రం క్రోసూరుకు మధ్యాహ్నానికే ఇసుకవేస్తే రాలనంతగా జనం చేరుకున్నారు.
చిరు షో ఫ్లాప్ అవడం ఖాయమనుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు జనసంద్రాన్ని చూసి అవాక్కయ్యారు. ఎర్రబాలెం-క్రోసూరు మెయిన్ రోడ్డు, క్రోసూరు పట్టణం చిరంజీవి అభిమానులు, యువజనాలతో కిక్కిరిసిపోయాయి. గత 30 సంవత్సరాల్లో ఇంతటి జనవాహినిని ఎన్నడూ చూడలేదని స్థానిక వ్యాపారి రామకోటేశ్వరరావు చెప్పారు. ఆఖరికి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా ఇంతమంది జనం రాలేదన్నారు.
News Posted: 14 February, 2009
|