'రాజ్యం' వెంటే మావోలు!
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో మావోయిస్టుల మద్దతు ఏ పార్టీకి దక్కుతుందన్న అంశంపై అయోమయం కొనసాగుతోంది. ఇప్పటికే చరిత్ర కలిగిన పార్టీలకు అతీతంగా కొత్త పార్టీకి మావోయిస్టుల మద్దతు లభించే అవకాశాలున్నాయని సమాచారం. మావోయిస్టు పార్టీ ప్రతినిధుల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నోపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీకే మావోయిస్టుల మద్దతు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో వున్న తెలుగుదేం, ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ తోపాటు బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి, కమ్యూనిస్టు పార్టీలకు మావోయిస్టులు వ్యతిరేకంగా ఉండడంతో ఆ పార్టీలకు వారి మద్దతు ఉండబోదని స్పష్టమవుతోంది.
ఇటీవల మావోయిస్టుల ఉత్తర తెలంగాణ ప్రాంత స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి చంద్రన్న కూడా ప్రధాన పార్టీలను మావోయిస్టుల ద్వేషులుగా ప్రకటించారు. అన్ని పార్టీలను విశ్లేషించిన చంద్రన్న ప్రజారాజ్యాన్ని మాత్రం వదిలేశారు. ఆ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోవడాన్ని మాత్రమే విమర్శించిన చంద్రన్న ఇతర అంశాల్లో ప్రజారాజ్యం పై పెద్దగా స్పందించకపోవడం ఆ పార్టీలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అందుకే మావోయిస్టుల సమస్యను సామాజిక సమస్యగానే ప్రజారాజ్యం నాయకులు చెబుతుండడం విశేషం.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటినుండి నక్సలైట్ల అణచివేతకే చర్యలు తీసుకుంది. 2004లో మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా చర్చలు నిర్వహించడం, అవి విఫలంకావడంతో మావోయిస్టులపై పోలీసులు పెద్ద ఎత్తున విరుచుకుపడి రాష్ట్రంలో దాదాపు మావోయిస్టు ఉద్యమం ఉనికి లేకుండా చేయడంతో వారు కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ రెండు దఫాలు అధికారంలో వున్న సమయంలో కూడా మావోయిస్టులకు ఎదురుదెబ్బలే తగిలాయి. అనేకమంది సీనియర్లు ప్రామాలు కోల్పోయారు. అందువల్ల నక్సలైట్లు తెలుగుదేశానికి కూడా అనుకూలంగా వ్యవహరిచే పరిస్థితి కనిపించడం లేదు.
Pages: 1 -2- News Posted: 22 February, 2009
|