పట్టుపురుగులతో పచ్చళ్ళు!
ఇండోర్ : పక్కా శాకాహారులకు ఈ పరిణామం ఆగ్రహం కలిగించవచ్చు. కాని మధ్య ప్రదేశ్ పట్టు సమాఖ్య (ఎంపిఎస్ ఎఫ్) పట్టుపురుగుల ప్యూపేతో తినుబండారాలను తయారు చేసింది. రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖకు ఈ సమాఖ్య అనుబంధ సంస్థ. పట్టుపురుగుల ప్యూపేను మానవ, జంతు, చేపల ఆహారంగా యూరప్ దేశాలకు ఎగుమతి చేసే చైనాతో పోటీ పడడం సమాఖ్య వ్యూహం.
మధ్య ప్రదేశ్ లో ప్రతి సంవత్సరం 15 టన్నుల పట్టుపురుగుల ప్యూపే ఉత్పత్తి జరుగుతుంటుంది. వాటి నుంచి పట్టు నూలును తీసిన తరువాత అవి వ్యర్థం అవుతున్నాయి. ఒక కిలో పట్టుగూళ్ళ నుంచి 122 నుంచి 300 గ్రాముల వరకు పట్టు నూలు ఉత్పత్తి అవుతుంది. మిగిలిన 700 గ్రాములు ప్యూపే. అందువల్ల ప్యూపే నుంచి మనుష్యులు తినే ఆహారం తయారు చేసే అవకాశాలను అన్వేషించాలని సమాఖ్య అనుకున్నది.
Pages: 1 -2- News Posted: 24 February, 2009
|