లా కాలేజీల్లో ఏజ్ 'బార్'!
ముంబై : దేశవ్యాప్తంగా లా కాలేజీలలో వయోపరిమితిని ప్రవేశపెట్టాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) నిర్ణయించింది. కాని విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదు. దీనికి దిగ్భ్రాంతి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఈ 'వివాదాస్పద నిబంధనను' ప్రవేశపెట్టే ముందు సరైన చర్చ జరపాలని సూచించారు. ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తే 20 ఏళ్ళు దాటినవారెవ్వరూ సమగ్ర ఐదు సంవత్సరాల ఎల్ఎల్ బి కోర్సులో చేరలేరు. 12వ తరగతి పాసైన తరువాత విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. మూడు సంవత్సరాల ఎల్ఎల్ బి డిగ్రీ ోర్సులో చేరాలని ఏ విద్యార్థి అయినా అభిలషిస్తే సదరు విద్యార్థి వయస్సు 30 దాటరాదు. (మూడేళ్ళ ఎల్ఎల్ బి కోర్సులో చేరాలంటే ఏదైనా బ్యాచ్ లర్ డిగ్రీ ఉండడం తప్పనిసరి).
దేశంలో న్యాయశాస్త్ర విద్యకు సంబంధించిన నిబంధనలు, ప్రమాణాలను నిర్థారించే అగ్రశ్రేణి సంస్థ బిసిఐ. సంస్థ సలహాను న్యాయశాస్త్ర విద్యా సంస్థలు పాటించవలసిందే. అయితే, 'ఏ మార్పునైనా క్రమేణా, బాగా ఆలోచించిన మీదట, ఏకాభిప్రాయాన్ని సాధించి ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఈ విధాన నిర్ణయ ప్రక్రియలో కాలేజీలు, ప్రిన్సిపాల్స్, లాయర్లు, అధ్యాపకులు, విద్యార్థులకు ప్రమేయం కల్పించాలి' అని ముంబైలోని జి.జె. అద్వానీ లా కాలేజీ ప్రిన్సిపాల్ విజయ్ ఘోర్మడే అభిప్రాయం వెలిబుచ్చారు.
బిసిఐ వైస్ చైర్ పర్సన్ జె.ఆర్. బెణివాల్ ఈ ప్రతిపాదనను సమర్థించారు. 'న్యాయశాస్త్ర విద్య ప్రమాణాలను మెరుగుపరచాలని మేము కోరుకుంటున్నాం. 70 సంవత్సరాల వృద్ధునికి ఈ విద్యార్జనకు అవకాశం కల్పించరాదని కోరుకుంటున్నాం. వైద్య, ఇంజనీరింగ్ విద్యతో సమానంగా లా విద్య కూడా ఉండాలి' అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 300 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలలో 12 నేషనల్ లా స్కూల్స్, 300 పైచిలుకు లా కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లా కోర్సులలో వేలాది మంది విద్యార్థులు చేరుతున్నారు.
Pages: 1 -2- News Posted: 24 February, 2009
|