కూటమి కుంటి నడక
హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోయినా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల కంటె ప్రచారంలో ముందంజలో ఉంది. ప్రజారాజ్యం దాని తరువాత స్థానంలో ఉండగా, తెలుగుదేశం నాయకత్వంలోని మహా కూటమి బాగా వెనుకబడి ఉంది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎంతో ఉత్సాహంగా, వ్యూహాత్మకంగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటుండగా, మొదట్లో వెనుకబడిన ప్రజారాజ్యం అధినేత క్రమంగా పుంజుకుంటూ జనంలోకి వెళ్లడంలో మహా కూటమి కంటె ముందుకెళ్లిపోయారు. చిరంజీవితో పాటు ఆయన సోదరుడు, యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచార యాత్రలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావు, బివి రాఘవులు, కె.నారాయణ ప్రచారాన్ని పక్కన పెట్టి, రాజశేఖర రెడ్డి పైన, ఆయన కుమారుడి పైన ఫిర్యాదులు, ఆరోపణలు చేయడానికే పరిమితమయ్యారు.
కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ దళిత విభాగం నాయకులు కూడా యాత్రలు ప్రారంభించారు. బిసి విభాగం కూడా ప్రచారంలో పాల్గొంటోంది. పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఇంకా ప్రచారం ప్రారంభించ లేదు. ముఖ్యమంత్రి రాజశఖర రెడ్డి ప్రతి రోజూ రెండు జిల్లాల్లో ప్రచారం సాగిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. తమ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అజెండాగా పర్జలను ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర అధికార కార్యక్రమాకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ వంటి కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు చేరడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి, ఎన్నికల షెడ్యూల్ వెలివడే లోగా పెండింగ్ బిల్లులు చెల్లించివేయాలని సూచించారు.
Pages: 1 -2- News Posted: 26 February, 2009
|