కేసీఆర్ ఇదేంటి?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖర రావు ధోరణితో కూటమి నాయకులు కంగు తింటున్నారు. ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కితే హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ లో సెగలు మొదలు కాగానే ఢిల్లీ వెళ్లి పోతున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా మహా కూటమి ఆధ్వర్యంలో జరిగిన జైల్ భరో కార్యక్రమంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సిపిఎం కార్యదర్శి రాఘవులు, సిపిఐ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. కాని గతవారం ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. పార్లమెంటు సమావేశాల చివరి రోజైన గురువారం టి.ార్.ఎస్ ఎంపి వినోద్ లోక్ సభలో కొద్దిసేపుతెలంగాణా నినాదాలు చేశారు. అప్పుడు సభలోనే ఉన్న కెసిఆర్ మాత్రం తెలంగాణపై చర్చ జరిపించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు.
మహాకూటమిలోని మిత్రపక్షాల నాయకులు రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసి వైెస్ ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదులు ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు, రాఘవులు, నారాయణ తిరిగి హైదరాబాద్ చేరుకోగా కెసిఆర్ అక్కడే ఉండిపోయారు. గురువారం వస్తున్నట్టు పార్టీ నాయకులకు కబురు పంపించారు కాని రాలేదు. జైల్ భరో కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన లేదేమని చంద్రబాబును విలేఖరులు అడిగితే, 'వైఎస్ ట్రాప్ లో పడకండి' అంటూ అర్ధంకాని జవాబిచ్చారు. జైల్ భరోలో కోసిఆర్ పాల్గొనకుండా పార్టీ నాయకుడు నాయని నరసింహారెడ్డిని పంపించడం కూడమి నాయకులకే మింగుడు పడలేదట.
Pages: 1 -2- News Posted: 26 February, 2009
|