'మర్మం' మార్కెట్ మంత్రం
ముంబై: టాటా క్సెనాన్ ఎక్స్ టి, ఏరియల్ ఆక్సీ బ్లూ, ఆప్టీ థిక్ హార్పిక్, క్లీనిక్ ఆల్ క్లియర్ జడ్ పిటిఓ, ఓరియంట్ పిఎస్ పిఓ, జాన్సన్ బేబీ ఆయిల్-ఆలొ వెరా ఇలా ప్రతి సరకుకు దాని బ్రాండ్ పేరుతో పాటు ఒక తోక (టాగ్) కూడా ఉంటుంది. ఈ టాగ్ ఆ బ్రాండ్ విశిష్టతలను తెలియజేస్తుందని అందరూ అనుకుంటారు. అయితే ఆ టాగ్ అర్ధమేమిటో తెలుసుకోకుండానే వినియోగదారులు తరచు కొనుగోలు చేస్తుంటారు. ఆ టాగ్ ఉంటే ఏదో ప్రత్యేకత ఉన్నట్లు భావించి కొనుగోలు చేస్తుంటారు. టాగ్ లేకపోతే ఏ ప్రత్యేకతలు లేని సరుకులుగా భావించి వినియోగదారులు వాటి పట్ల ఆసక్తిని కనబరచరు.టాగ్ అర్ధం తెలియకపోయినాసరే టాగ్ ఉంటే చాలు వినియోగదారులు కొనుగోలు చేస్తారని మార్కెట్ మనోవిశ్లేషకులు తెలియజేస్తున్నారు.
టాగ్ తో కూడిన బ్రాండ్ పట్ల వినియోగదారుల మోజును ఉపయోగించుకునే ఉద్దేశ్యం ఓరియంట్ ఫ్యాన్స్ అడ్వర్టైజ్ మెంట్ ఈ టాగ్ పైనే సాగుతుంది.'వీరికి పిఎస్ పిఓ అంటే తెలియదు' అనే మాటపైనే ఒరియంట్ యాడ్ సాగుతుంది. చివరికి పిఎస్ పిఓ అంటే 'పీక్ స్పీడ్ పెర్ఫార్మెన్స్ ఔట్ పుట్' అనే వివరణతో పై టాగ్ ఉన్న ఓరియంట్ ఫ్యాన్ కొనుమంటూ యాడ్ ముగుస్తుంది. ఇలా ఒక్కొక్క బ్రాండ్ టాగ్ కు ఒక్కొక్క నిర్ధిష్ట అర్ధం ఉంది. పిఎస్ పిఓ టెక్నాలజీ అంటే తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ గాలిని, విశాలమైన ప్రదేశానికి అందించగల ఫ్యాన్ టెక్నాలజీ అని అర్ధం. జడ్ పిటిఓ అంటే చుండ్రును కల్గించే సూక్ష్మజీవులను నాశనం చేసే రసాయనం. అయితే చుండ్రు రావడానికి చాలా కారణాలున్నాయనుకోండి.
టాటా క్సెనాన్ ఎక్స్ టి బ్రాండ్ లోని ఎక్స్ టి అనే టాగ్ కు క్రాస్ టెర్రయిన్ అని అర్ధం. అదే విధంగా అలొవెరా అనేది ఒక ఔషధ మొక్క.. చాలా మంది వినియోగదారులకు ఈ టాగ్ ల వివరాలు అసలు తెలియకుండానే కొనుగోలు చేస్తుంటారు. అర్ధాలు తెలియకపోయినప్పటికీ ఈ టాగ్ లు వారి కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని మార్కెటింగ్ గురు మార్టిన్ లిండ్ స్ట్రామ్ 'బై ఆలజీ' అనే పుస్తకంలో మన కొనుగోలులో దాగున్న సత్యం, అబద్దాల గురించి రాశారు. వినియోగదారుల సెంటిమెంట్ ను వినియోగించుకుని కొన్ని కంపెనీలు అర్ధం లేని ట్యాగ్ లను మార్కెటింగ్ టెక్నిక్ లో భాగంగా ప్రచారం చేస్తున్నాయి.
Pages: 1 -2- News Posted: 27 February, 2009
|