గైర్హాజర్ లో 'వారు' ఘనులు
న్యూఢిల్లీ : పద్నాలుగవ లోక్ సభ సమావేశాలు గురువారం (26)తో ముగిశాయి. ఇప్పుడు అందరి కళ్ళూ రానున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్రీకృతమయ్యాయి. పద్నాలుగవ లోక్ సభ సమావేశాలలో ఆగ్రహావేశాలు, ఉద్రిక్తపూర్వక చర్చలు చోటుచేసుకున్నప్పటికీ, క్రమం తప్పకుండా సభకు హాజరు కావాలనేది అలవాటు చేసుకోని ఎంపిలు కూడా అనేక మంది ఉన్నారు. కొంత మంది ఎంపిలైతే 14వ లోక్ సభకు డుమ్మా కొట్టడంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందారు.
సభకు గైర్ హాజరైన సభ్యులలో అగ్ర స్థానం గోవింద అరుణ్ అహుజాదే. ఆయన తనకు అత్యంత ప్రీతిపాత్రమైన బాలీవుడ్ తోనే బిజీగా ఉండిపోయారు. ఇక ధర్మేంద్రకు నిర్లక్ష్యానికి గురైన రాజస్థాన్ బికనేర్ నియోజకవర్గం కన్నా తన కుమారుల కెరీరే అత్యంత ప్రధానం అయింది.
శిబు సోరెన్ జైలుకు రాకపోకలు సాగిస్తూ పార్లమెంట్ కు దూరంగా మసిలారు. మమతా బెనర్జీకి నానోతోను, టాటాలతోను పోరాటమే సరిపోయింది. పార్లమెంట్ లో తన ప్రత్యర్థులను ఢీకొనాలని ఆమె కోరుకోలేదు.
మరి ఎంపిలలో ఆత్మావలోకనం ఏమైనా జరుగుతోందా?
'ఈసారి నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మరింత బాగా సేవలు అందిస్తానని నా నియోజకవర్గ ప్రజలకు, నా పార్టీకి వాగ్దానం చేస్తున్నాను' అని సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) ఎంపి అఖిలేష్ యాదవ్ చెప్పారు.
పై జాబితా సభకు గైర్హాజరైన ప్రముఖులు కొందరితో కూడుకున్నది మాత్రమే. కాని 14వ లోక్ సభ కాలంలో 30 శాతం లోపు హాజరు ఉన్న సభ్యుల సమగ్ర జాబితా కూడా ఉన్నది. వారిలో అతీక్ అహ్మద్ (20 శాతం), బాబూలాల్ మరాండి (29 శాతం), దయానిధి మారన్ (10 శాతం), ధర్మేంద్ర (24 శాతం), గోవింద (12 శాతం), ఎం.హెచ్. అంబరీష్ (27 శాతం), మమతా బెనర్జీ (18 శాతం), మహమ్మద్ షాహబుద్దీన్ (24 శాతం), పప్పు యాదవ్ (4 శాతం), శిబు సోరెన్ (14 శాతం) ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 28 February, 2009
|