యాష్కీకి అజర్ ఎసరు?
హైదరాబాద్: నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మధు యాష్కీని తరిమి వేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి దేవుడిచ్చిన వరంలా కనిపించాడు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలనుకున్న వైఎస్ నిజామాబాద్ టిక్కెట్ ను అజారుద్దీన్ కు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్ నియోజకవర్గం ఎంఐఎంకు రిజర్వు అయినందువల్ల సికిందరాబాద్ నుంచి పోటీచాయడానికి అజారుద్దీన్ ఆసక్తి చూపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.అయితే సికిందరాబాద్ నియోజకవర్గంలో ముస్లిం జనాభా తక్కువైనందువల్ల అతడు నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని రాజశేఖరరెడ్డి భావిస్తున్నారు.
అయితే, నిజామాబాద్ మాత్రమే ఎందుకు? ఆ నియోజకవర్గంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నదున అజర్ విజయం తథ్యం కాబట్టి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సెంటిమెంటు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ టిక్కెట్ బలమైన అభ్యర్ధికి ఇవ్వాలన్న పార్టీ అభిమతం కూడా సార్ధకమవుతుందని రాజశేఖరరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. అంతే కాకుండా, తెలంగాణా వివాదం మొదలైనప్పటి నుంచీ వైఎస్ కంట్లో నలుసులా వున్న మధు యాష్కీని అక్కడినుంచి పంపించేయడానికి వీలవుతుందన్నది వారి వాదన. ఎఐసిసి కార్యదర్శి అయిన యాష్కీపైన, ఆయన కుటుంబ సభ్యులపైన పోలీసు కేసు నమోదైనందువల్ల ఆయన ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. అమెరికా రాయబారి కార్యాలయంలో నకిలీ పత్రాలు సమర్పించినందుకు యాష్కీపై కేసు నమోదు చేయాలని ఒక మేజిస్ట్రేట్ పోలీసులను అదేశించారు.
Pages: 1 -2- News Posted: 1 March, 2009
|