40 కోట్ల బల్బులు ఔట్!
ముంబై: గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టే దిశగా భారతదేశం తొలి పెద్ద అడుగు వేయబోతోంది. వాతావరణ మార్పునకు సంబంధించిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఎపిసిసి) కింద కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ 2012 సంవత్సరాంతానికల్లా దేశవ్యాప్తంగా 40 కోట్ల మామూలు (ఇన్ కాండిసెంట్) దీపాల బల్బులను తొలగించి పర్యావరణ అనుకూల కాంపాక్ట్ ఫ్లోరసెంట్ లాంప్ (సిఎఫ్ఎల్) బల్బులను ఉపయోగించాలని నిశ్చయించింది.
ఈ 'బచత్ లాంప్ యోజన' (దీపాల పొదుపు పథకం) లక్ష్యం 55 మిలియన్ టన్నుల కార్బన్ డైయాక్సైడ్ ను ఆదా చేయడం. ఇది బొగ్గుతో నడిచే నాలుగు భారీ విద్యుత్ ప్లాంట్ల మూసివేతకు సమానం. కార్బన్ డైయాక్సైడ్, మెథేన్ వంటి ఉష్ణగ్రాహక వాయువులు వెలువడడం వాతావరణ మార్పునకు ప్రధాన కారణాలలో ఒకటిగా భావిస్తున్నారు. 'మేము దేశాన్ని ప్రాజెక్టు ఏరియాలుగా విభజిస్తాం. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏరియాలో 5 లక్షల జనాభా ఉంటుంది. ప్రతి ఏరియాలో ఎంపిక చేసిన 24 విద్యుదుత్పాదక సంస్థలలో ఒకటి రూ. 15కు సిఎఫ్ఎల్ ను విక్రయిస్తుంది' అని ఇంధన సామర్థ్య మండలి (బిఇఇ) డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 1 March, 2009
|