సిపిఐకి 'అగ్ని పరీక్ష'
ఢిల్లీ: వయసు మీద పడుతున్నా వళ్లు మాత్రం పెరగలేదన్నట్టుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పరిస్థితి. దేశంలోని బాగా పాత పార్టీల్లో ఒకటైన సిపిఐకి జాతీయ స్థాయి పార్టీగా మనుగడ కోల్పోయే పరిస్థితి మరోసారి ఎదురుకానుంది. ఈ ఆ హోదాను కాపాడుకోవాలనుకుంటే ఈ సారి మరిన్ని సీట్లు సాధించక తప్పదు. క్రితంసారి(2004) ఎన్నికల సమయంలోనే 'లోక్ సభ ఎన్నికల్లో మీరు సాధించిన సీట్లను బట్టి మీ పార్టీ గుర్తింపు ఎందుకు రద్దు చేయరాదో సంజాయిషీ ఇవ్వండ'ని ఎన్నికల కమిషన్ సపిఐతో పాటు మరో తొమ్మిది రాష్ట్ర స్థాయి పార్టీలకు శ్రీముఖం పంపింది. ప్రస్తుతం ఈ గుర్తింపునకు అర్హతలేమిటంటే- లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఆరు రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు లేదా సభలోని మొత్తం స్థానాల్లో కనాసం రెండు శాతం స్థానాలు సాధించాలి.
అయితే 2004 ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల కంటె ఎక్కువ స్థానాలే దక్కాయనుకున్న సిపిఐకి, మొత్తం ఓట్లలో కేవలం 1.41 శాతం దక్కాయి. అప్పుడు పార్టీ పోటీ చేసిన సీట్ల సంఖ్య 34. దానితో పాటు ఏ జాతీయస్థాయి పార్టీ అయినా లోక్ సభలో కనీసం 11 మంది ఎంపిలను కలిగి ఉండాలన్న షరతుకు కూడా సరికాలేక పోయింది. ప్రస్తుతం లోక్ సభలో సిపిఐ సభ్యులు పదిమంది మాత్రమే ఉన్నారు. ఎన్నికల కమిషన్ 2005లో పై మార్గదర్శక సూత్రాలను సవరించడంతో సిపిఐ, మరికొన్ని పార్టీలు లబ్ధి పొందాయి. దీనితో పాటు, కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ జాతీయ స్థాయి గుర్తింపును అర్హత కలిగి ఉంటుందనే వెసులుబాటును కమిషన్ కల్పించింది.
Pages: 1 -2- News Posted: 7 March, 2009
|