36 కోట్ల 'మొబైల్' ఓటర్లు!
న్యూడిల్లీ: గత సార్వత్రిక ఎన్నికలలో ఆరోగ్యం సహకరించని కారణంగా అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి ఏ సభా వేదికపై నుంచి ర్యాలీలో అత్యధిక సంఖ్యలో జనాన్ని ఉద్దేశించి ప్రత్యక్షంగా ప్రసంగించలేదు. కాని సెల్ ఫోన్ల ద్వారా వారికి ఆయన సందేశం అందింది. అప్పటి ప్రధాని వోట్ల కోసం చేసిన అభ్యర్థనను రికార్డు చేసి సెల్ ఫోన్లలో వినిపించారు. 2004లో దేశంలో 35 మిలియన్ల మంది సెల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు.
ఆ సీన్ కట్ చేసి 2009 సంవత్సరానికి వస్తే ఆ సంఖ్య పదింతలు పైగా అంటే 360 మిలియన్లకు పెరిగింది. దీనితో వోటర్లకు నేరుగా ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీలకు కొత్త మాధ్యమం అందుబాటులోకి వచ్చింిద. కాల్ రేట్లు, హ్యాండ్ సెట్ ధరలు బాగా తగ్గడం వీటి సంఖ్య ఇంతలా పెరిగిపోవడానికి కారణం. టెక్నాలజీలో వచ్చిన మార్పు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కానవస్తున్న ఈ మార్పు ఈ విధమైన రాజకీయ ప్రచారానికి ఉపకరిస్తున్నది.
రేడియో కూడా తిరిగి ప్రాముఖ్యం సంతరించుకుంటున్నది. ఎఫ్ఎం చానెల్స్, డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) టెలివిజన్ కారణంగా మారుమూల గ్రామాలలో కూడా కొత్త వీక్షకులు, శ్రోతలు రంగంలోకి వచ్చారు. ఇప్పుడు వారికి సులభంగా అందుబాటులోకి రావచ్చు. అదే సమయంలో వార్తలు, అభిప్రాయాలు, విశ్లేషణల గురించిన చైతన్యం పెరిగిపోవడంతో రాజకీయ నాయకులు ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.
Pages: 1 -2- News Posted: 7 March, 2009
|