కోటగిరికి ఉంగుటూరు!
హైదరాబాద్: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సిన తేదీలు దగ్గర పడుతుండడంతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధుల జాబితాలను ఖరారు చేయడంలో నిమగ్నమై ఉంది. గెలిచే అవకాశాలు గల అభ్యర్ధుల దాబితాను పార్టీ ఎన్నికల కమిటీ అప్పుడే సిద్దం చేసింది. అభ్యర్ధుల తొలి జాబితా మార్చి 10వ తేదీనాటికి ప్రకటిస్తామని పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. తాను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి అసెంబ్లీకి చేయవచ్చునన్నారు. తిరుపతి నుండి పోటీ చేయడం ఖాయం కాగా, తెలంగాణా నియోజకవర్గం ఇంకా ఖరారు కావలసి ఉంది. పార్టీ తరఫున పోటీచేసే అవకాశాలు గల అభ్యర్దులలో అల్లు అరవింద్, బూరగడ్డ వేదవ్యాస్, వంగవీటి రాధాకృష్ణ, జ్యోతుల నెహ్రూ ఉన్నారు.
జిల్లాలవారీగా అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా: హైదరాబాద్: గోవింద్ రాఠి(గోషామహల్0,విజయేంద్ర(జూబిలీహిల్స్), పి.నిలయ్ కుమార్(సనత్ నగర్), షరీఫ్(నాంపల్లి), దేముడు(కంటోన్మెంట్). రంగారెడ్డి: బి.రమేశ్(శేరిలింగంపల్లి), వెంకటేశ్వర్(మహేశ్వరం). మెదక్: బత్తి జగపతి(మెదక్), పెంటమ్మ(ఆందోల్).నల్గొండ: జె.సుధాకర్(కోదాడ), కరుణ(సూర్యాపేట), రామచంద్ర నాయక్(నాగార్జునసాగర్). మహబూబ్ నగర్: జనార్దన్(మహబూబ్ నగర్). వరంగల్: మంద అయిలయ్య(పరకాల), నిజామాబాద్: కరుణాకర్ రెడ్డి(బోధన్), అరుణతార(జుక్కల్). కరీంనగర్: మమత(కోరుట్ల).
Pages: 1 -2- News Posted: 8 March, 2009
|