గీతారెడ్డికి టిక్కెట్ లేనట్టే!
దరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న మహిళల సంఖ్య కాంగ్రెస్ లో ఎక్కువగానే ఉన్నప్పటికీ, 30మందికి మించి లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. జిల్లాకు ఒకరు వంతున మొత్తం 23 జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో ఇద్దరు వంతున టిక్కెట్లు పొందనున్నారు. అంటే దాదాపు సిట్టింగులందరికీ టిక్కెట్లు లభించనున్నాయి. భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జనరల్ కేటగిరీకి మారినందున ఆమెకు కొత్తగా నియోజకవర్గం లేకపోవడంతో మళ్లీ టిక్కెట్ లభించే అవకాశం లేదు. ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఒక మహిళకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానవరగ్ం సూచించింది. దీని ప్రకారం రాష్ట్రంలో 42 అసెంబ్లీ టిక్కెట్లు మహిళలకు కేటాయించవలసి ఉంది. అయితే క్రితంసారి కంటె ఈ సారి ఎక్కువ మందికే టిక్కెట్లు లభించే అవకాశాలున్నాయి.
జిల్లాలవారీగా చూస్తే, శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతికి మళ్లీ టిక్కెట్ లభించనుంది. విజయనగరం జిల్లాలో గుమ్మడి సంధ్యారాణి, విశాఖ జిల్లాలో తిప్పల జ్వాల, ఉమారాణి, విజయారెడ్డిలకు టిక్కెట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో జక్కంపూడి విజయలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉషారాణి(పాలకొల్లు), వంకా రాజకుమారి(తణుకు), కృష్ణా జిల్లాలో తాంతియాకుమారి, నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి రాజ్యలక్ష్మి, మాగుంట పార్వతమ్మ, ప్రకాశం జిల్లాలో డాక్టర్ కృష్ణవేణి(కొండపి), చిత్తూరు జిల్లాలో కుతూహలమ్మ, గల్లా అరుణ కుమారి, కడప జిల్లాలో ప్రభావతమ్మ, అనంతపురం జిల్లాలో భానుమతి, కర్నూలు జిల్లాలో కోట్ల సుజాతమ్మలకు టిక్కెట్లు లభించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Pages: 1 -2- News Posted: 9 March, 2009
|