పాతాళానికి ఆర్థిక వ్యవస్థ
వాషింగ్టన్: ప్రపంచ ఆర్దిక వ్యవస్థ మరింత కుంగిపోనుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ఇలాంటి గడ్డు కాలం ఎన్నడూ తలెత్తలేదు. ఒక్క భారత దేశంలోనే ఈ మధ్య కాలంలో దాదాపు 10 లక్షల జాబ్స్ మాయమైనాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, ప్రపంచ వాణిజ్యం మరింతగా కుదించుకోబోతుందని ప్రపంచ బ్యాంక్ ఊహించింది. 2009లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కనీస మాత్రంగా 5 శాతం పెరిగే అవకాశముంది. ప్రపంచ వాణిజ్యం 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజాపోనుంది. తూర్పు ఆసియాలో వాణిజ్యం కుప్పకూలి పోనుంది.
ప్రపంచ పారిశ్రామికోత్పత్తి 2009 మధ్యనాటికి 15 శాతం పెరిగే అవకాశముందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2008 పారిశ్రామికోత్పత్తితో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది. వచ్చే శనివారంనాడు జరుగనున్న గ్రూప్ 20 దేశాల ఆర్ధిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం కోసం ప్రపంచ బ్యాంకు రూపొందించిన పత్రంలో ఈ అంచనాలను వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ఏడాదిలో దాదాపు 270-700 బిలియన్ డాలర్ల ద్రవ్య లోటును ఎదుర్కోనున్నట్లు బ్యాంక్ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో ప్రైవేట్ రంగ రుణ దాతలు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు దూరమవుతారు. దెబ్బతిన్న దేశాల్లో కేవలం నాల్గవంతు మాత్రమే పేదరిక నిర్మూలన చర్యల్ని చేపట్టగలవు.
Pages: 1 -2- News Posted: 9 March, 2009
|