సత్యం ప్రెషర్స్ 'యూనియన్'
హైదరాబాద్: సంక్షోభంతో తల్లడిల్లిపోతున్న సత్యం కంప్యూటర్స్ సంస్థలో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. సత్యం ఆఫర్ లెటర్లు అందుకుని కొన్ని నెలలుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న సుమారు 8 వేల మంది ఐటి గ్రాడ్యుయేట్లు తమ ఉద్యోగాల సాధన కోసం ఒక యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా ట్రైనీలుగా కంపెనీ నుంచి ఆర్డర్ల కోసం ఆశగా చూస్తున్నవారే. ఇలాంటి వారందరు కలసి సత్యం ఫ్రెషర్స్ యూనియన్ (ఎస్ఎఫ్ యు) సంస్థను పక్షం రోజుల క్రితం ఏర్పాటు చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో సత్యం సంస్థ ఉద్యోగులుగా వారిని నమోదు చేసుకోవాలని ఈ యూనియన్ ద్వారా వారు ఆ సంస్థను కోరారు.
ఏప్రిల్ 1 నాటికి ఇంజినీరింగ్ కాలేజీల నుండి మరో బ్యాచ్ గ్రాడ్యుయేట్లు బయటకు రాబోతుండడంతో వీరందరూ ఆందోళన చెందుతున్నారు. కొత్త బ్యాచ్ విడుదల కాగానే జాబ్స్ మార్కెట్లో వీరు ఫ్రెష్ గ్యాడ్యుయేట్ల స్టేటస్ ను కోల్పోవలసి వస్తుంది. కాలేజీల నుండి కొత్త గా వస్తున్న వారిపై కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతనిస్తాయని వీరందరూ ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో విదేశీ ఉద్యోగాల కోసం అందించిే హెచ్1బి వీసాల విషయంలో కూడా కొత్తగా మార్కెట్ లోకి విడుదలైన గ్రాడ్యుయేట్లకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
మానవతా దృక్పథంతో తమ విషయాన్ని పరిగణించాలని సత్యం సిఈఓ ఏఎస్ మూర్తి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆడిటర్లు, కంపెనీ లా బోర్డు, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎస్ఎఫ్ యూ లేఖలు రాసింది. మాకు జీతాలు ముఖ్యం కాదు, అంతకంటే కూడా, మా కరికులమ్ విటాయే (సివి)ల్లో మేము వేతన ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తే చాలని ఆ యూనియన్ సభ్యులు కోరుకుంటున్నారు. మా యూనియన్ కార్మిక సంఘంలా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ కాదు. సత్యం ఫ్రెషర్స్ సమస్యను పరిష్కరించాలని నెల రోజుల క్రితం హైటెక్ సిటీలో ధర్నా నిర్వహించిన రాడికల్ డెమక్రటిక్ కార్పొరేట్ ఎంప్లాయూస్ కాంగ్రెస్ అనే ఒక రాజకీయేతర సంస్థకు అనుబంధంగా ఈ ఎస్ఎఫ్ యూ సంస్థను ఏర్పాటు చేశామని సంస్థ కన్వీనర్ పి వరుణ్ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 13 March, 2009
|