వోటింగ్ మెషీన్లో టైమర్లు
చెన్నై: వోటింగ్ మెషీన్లు కేవలం జనం వోట్లను నమోదు చేసేవి మాత్రమే కావు. 2009 లోక్ సభ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు (ఇవిఎంలు) జనం వోటు వేసిన సమయాన్ని కూడా నమోదు చేస్తాయి. ఇవిఎం కంట్రోల్ యూనిట్ లోనే టైమర్ ను అమరుస్తున్నట్లు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్ - బెల్) జనరల్ మేనేజర్ అమోల్ నెవాస్కర్ తెలియజేశారు. ఇవిఎంల తయారీ కోసం ఎన్నికల కమిషన్ (ఇసి) అధికారం ఇచ్చిన రెండు ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటి బెల్. రెండవది హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్).
వోటింగ్ మొదలైన సమయాన్ని ఈ గడియారం నమోదు చేస్తుంది. ఇది గంట గంటకు వోటింగ్ శాతాన్ని కూడా వెల్లడించగలదు. అయితే, అభ్యర్థికి ఏమేరకు వోట్లు పోలయ్యాయో వివరాలను మాత్రం ఇది ఇవ్వదు. 'దీని వల్ల మోసాలను నివారించవచ్చు. ఉదాహరణకు, పోలింగ్ రోజు మొదట్లో, చివర్లో భారీగా పోలింగ్ జరిగినట్లయితే, అధికారులు అప్రమత్తులై అందుకు కారణాన్ని పరిశోధించవచ్చు. లేదా ఎవరైనా తన వోటుపై వివాదం లేవదీస్తే, సదరు వ్యక్తి ఎప్పుడు దానిని వేసారో ఇది సూచిస్తుంది' అని నెవాస్కర్ తెలియజేశారు. ఇసిఐఎల్ తయారు చేస్తున్న ఇవిఎంలలో కూడా గడియారాలు అమరుస్తున్నట్లు బెల్ డైరెక్టర్్ హెచ్.ఎస్. బాదోరియా తెలిపారు. బెల్, ఇసిఐఎల్ సంస్థలు ఎన్నికల కమిషన్ కు సరిసమానంగా ఇవిఎంలను సరఫరా చేస్తాయి.
Pages: 1 -2- News Posted: 13 March, 2009
|