బాలయ్యకు బావ లేఖ
హైదరాబాద్: సోదరి పురందరేశ్వరి పట్ల, తన పట్ల ఎన్టీ రామారావు తనయుడు హీరో బాలకృష్ణ ప్రవర్తించిన తీరుకు కలతచెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిదికి పాతరోజులు గుర్తుకు తెస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. దానిని ఫిబ్రవరి ఒకటో తేదీనే రాసినప్పటికీ సంస్కారంతో బహిర్గతం చేయలేదని, కాని ఇప్పుడు పత్రికలకు విడుదల చేయక తప్పలేదని విలేఖరులతో అన్నారు. బాలకృష్ణకు రాసిన లేఖలో 'నీ మాటలు వింటుంటే 1995 ఆగస్టు నెలలో నాన్నగారిని ముఖ్యమంత్రి పదవు నుంచి దించిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. ఆ రోజు నువ్వు నేరుగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి సచివాలంయెలో రెవెన్యూ మంత్రిగా వున్న చద్రబాబు చాంబర్ కు రావడం, అక్కడి నుంచి హరికృష్ణకు ఫోన్ చెయ్యడం,హరికృష్ణ రానంటే చంద్రబాబు తానే ాయనింటికి వెళ్లడానికి తయారవగా హరికృష్ణ చంద్రబాబు చాంబర్ కు రావడం, సాయంత్రం మీరు ముగ్గురూ మా ఇంటి దగ్గర నాకోసం వేచి ఉండడం, నన్ను వైస్రాయ్ హోటలవ్ కు రమ్మనడం, నేను చిన్నమ్మ(పురందరేశ్వరి) మాట వినకుండా వైస్రాయ్ కి బలుదేరడం... ఆ విధంగా ఆ నాటి పాపంలో నేను కూడా పాలుపంచుకోవడం జరిగిపోయింది' అని పేర్కొన్నారు.
'అయితే నాకు అర్ధంకాని విషయం ఇప్పటికీ ఒకటి ఉండిపోయింది. అదేమిటంటే, చంద్రబాబు మీ ఇద్దరికీ ఏమి చెప్పి మీ నాన్నను పదవీచ్యుతుడిని చేయడానికి కార్యోన్ముఖుల్ని చేశాడా అని. ఎందుకంటే, గదిలో ఏకాంతంగా తను ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్పాడు. బయటకు వచ్చిన తరువాత హరికృష్ణ తనకు మంత్రి పదవి కావాలని అనగానే, నేను నాకు మంత్రివర్గంలో స్థానం అక్కర్లేదని, హరికృష్ణే మంత్రిగా ఉండొచ్చని చెప్పాను. తర్వాత విషయం ఏమిటంటే వైస్రాయ్ కి వెళ్లిన తర్వాత చంద్రబాబు నన్ను పక్కకి పిలిచి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ను తొలగించి, ఆయన స్థానంలో తనను కూర్చోబెడుతున్నట్టు మీకు చెప్పమన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాను. వెంటనే తేరుకుని, 'నీవు పిల్లలకు(హరికృష్ణ, బాలకృష్ణ) ఏం చెప్పి ఇక్కడకు పిలిపించావు?' అని ప్రశ్నించగా, చంద్రబాబు చాలా చులకనగా 'ఆఁ ఏదో పిలిచేన్లే' అని జవాబిచ్చాడు.
Pages: 1 -2- News Posted: 19 March, 2009
|