నక్సల్ ఊసే లేని ప్రచారాలు
హైదరాబాద్: నాలుగు దశాబ్దాలలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలలో నక్సలిజం గురించిన ప్రస్తావన లేకుండానే ప్రచారం సాగుతోంది. 1960 దశకం చివర్లో నక్సల్ బరీ ఉద్యమం రూపుదిద్దుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతి సారి ఎన్నికలలో నక్సలిజం ప్రధానాంశంగా ఉంటూ వచ్చింది. రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా తుడిచిపెట్టుకు పోవడంతో, తమ రాజకీయ ప్రసంగాలలో ఈ అంశాన్ని ప్రస్తావించరాదని రాజకీయ పార్టీలు నిర్ణయించుకున్నాయి.
2004లో గత సార్వత్రిక ఎన్నికలలో నక్సలిజం ప్రస్తావన పరాకాష్ఠ స్థితిని అందుకుంది. దానిని పరిష్కరించవలసిన ఆవశ్యకత గురించి ప్రతి రాజకీయ పార్టీ సూచించింది. తమ ప్రత్యర్థి పక్షాలు ఆ నిషిద్ధ సంస్థతో 'లోపాయికారీ అవగాహన' కుదుర్చుకున్నాయని అవి ఆరోపణలు చేశాయి కూడా. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మావోయిస్టుల మద్దతు పొందుతోందని అప్పటి అధికార పక్షం తెలుగు దేశం పార్టీ (టిడిపి) ఆరోపించింది. మావోయిస్టుల నుంచి 'లోపాయికారీ' మద్దతు పొందుతున్నదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కూడా ఆరోపణలకు గురైంది.
Pages: 1 -2- News Posted: 22 March, 2009
|