దిగ్విజయ్ శపథం!
భోపాల్: ఎన్నికలలో పోటీ చేయడం కోసం పార్టీ టిక్కెట్లకై వెంపర్లాడే రాజకీయ నాయకులు ఉన్న దేశం మనది. కాని రానున్న లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయరాదనే తాను నిశ్చయించుకున్నట్లుగా చెబుతున్న రాజకీయ నాయకుడు ఒకరు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేయరాదనే దృఢచిత్తంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే, దిగ్విజయ్ సింగ్ నిర్ణయం కొత్తదేమీ కాదు. 2003 మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన ఆ ఎన్నికలలో కాంగ్రెస్ కనుక ఓడిపోతే తాను పది సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించారు.2003లో కాంగ్రెస్్ ఓడిపోయినందున 2013 వరకు పోటీ చేయరాదనే తన నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నారు.
అదే కారణంపైనే ఆయన 2008 నవంబర్ లో మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూడా పోటీ చేయలేదు. పార్టీని పటిష్ఠం చేయడం కోసం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా దిగ్విజయ్ సింగ్ ను ఎవ్వరూ కోరను కూడా లేదు. కాని ఈ దఫా పరిస్థితులు మారిపోయాయి. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా దిగ్విజయ్ సింగ్ కు సూచించవలసిందిగా కాంగ్రెస్ లో కొన్ని వర్గాలు పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నాయి. కాంగ్రెస్ సాధారణంగా వర్గాలుగా చీలిపోయిన పార్టీ. అయితే, దిగ్విజయ్ సింగ్ ను వ్యతిరేకించే వర్గాల నుంచే ఈ డిమాండ్ వస్తుండడం గమనార్హం. ఈ ఎన్నికలు కీలకమైనందున, కాంగ్రెస్ ను పటిష్ఠం చేసేందుకు దిగ్విజయ్ సింగ్ పోటీ చేయాలని వారు వాదిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 22 March, 2009
|