చంద్రగిరి 'రాణి' ఎవరో?
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): మహాద్భుతమైన చంద్రగిరి కోట ఒకప్పుడు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుకు వేసవి విడిదిగా భాసించింది. అది ఇప్పుడు 'రాణుల' పోరుకు సాక్షీభూతం కాబోతున్నది. కోటకు నాలుగు వైపులా మొక్కజొన్న తోటలు విస్తారంగా ఉండి పసుపు రంగుతో మెరసిపోతుండగా రాణి మహల్ రాజఠీవితో చూపరులకు ప్రధాన ఆకర్షణగా ఉంటున్నది. అయితే, అందరి కళ్ళూ చారిత్రక రాణి మహల్ పై కాకుండా నలుగురు 'రాణులపై' కేంద్రీకృతం అయ్యాయి. చిత్తూరు జిల్లాలో పుణ్యక్షేత్రం తిరుపతికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి నుంచి ఎన్నికలలో ఆధిపత్యం కోసం వారు పోటీ పడుతున్నారు. 'నారి' సాధికారత అనండి, లేక కాకతాళీయం అనండి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి), ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహిళా అభ్యర్థుల వైపే మొగ్గు చూపాయి.
టిడిపి అభ్యర్థి, తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా చిన్న తిరుమల ఆలయంలో ప్రార్థనలు చేస్తుండగా ఆమె అనుచరుడు సాయి ప్రతాప్ 'మా నాయకురాలి గ్లామర్ చాలు ప్రత్యర్థులు చిత్తయిపోవడానికి. అయితే, ఆమె అఖండ విజయం సాధించడానికై ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు' అని చెప్పారు. (సుప్రసిద్ధ తిరుమల సన్నిధానానికి వెళ్ళలేని వారు ఈ ఆలయానికి వస్తుంటారు.)
నియోజకవర్గాల పునర్విభజనకు ఈ నియోజకవర్గంలో 35 వేల మంది వోటర్లతో కమ్మవారిదే ఆధిపత్యం అయినప్పటికీ, ఇప్పుడు రెడ్లు మాట నెగ్గించుకుంటున్నారు. (నియోజకవర్గంలో 2.4 లక్షల మంది వోటర్లు ఉన్నారు.) అయినప్పటికీ సిట్టింగ్ ఎంఎల్ఎ, కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారికి గట్టి పోటీయే ఎదురుకానున్నది. ఆమె రోజాను, పిఆర్ పి అభ్యర్థి కాగల సాయిరమణీ రెడ్డిని, బిజెపి అభ్యర్థి గాలి పుష్పలతను ఢీకొనబోతున్నారు.
Pages: 1 -2- News Posted: 26 March, 2009
|