మహా సిగపట్లు ఎవరికి లాభం?
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో మహాకూటమిగా ఏర్పడిన భాగస్వామ్య పక్షాల మధ్య భావ సారూప్యత లోపించింది. సామజిక, ఆర్ధిక, రాజకీయ అంశాల్లో సఖ్యత లేకుండా పోయింది. సీట్ల సర్దుబాటు పెద్ద పేచీగా మారింది. బలాలు ఆధారంగా సమాన అవకాశాలు అనే మూల సూత్రాన్ని కూటమి విస్మరించింది. కూటమిలో సిద్ధాంత వైరుధ్యాలకు తోడు ఉమ్మడి అజెండా లేకపోవడంతో కుమ్ములాటలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకతతో భారీగా సీట్లు గెలుచుకుంటామని భావించిన పక్షాలు, గెలవకపోయినా కొత్త ప్రాంతాలకు పార్టీ విస్తరిస్తుందనే భావంతో ఉన్న భాగస్వామ్య పక్షాలు ఎవరికి వారు ్న్నట్టుగా వ్యవహరించి, సీట్ల పంపకంలో సిగపట్లకు దిగి ప్రజల్లో పలచనైపోతున్నాయి.నియాజకవర్గాల వారీగా సొంత బలం విషయంలో పారదర్శకత లోపించడం వెనుక నాయకుల స్వార్ధం దాగి ఉందనే భావన కూడా వివిధ పార్టీల శ్రేణులు ఇప్పటికే బహిర్గతం చేస్తున్నాయి.
రాజకీయ అవకాశవాదానికి ఊతమిచ్చే చర్యల వల్ల కూటమి బీటలు వారుతోంది. ెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశంపార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో సఖ్యత లేకపోగా, ఉభయ కమ్యూనిస్టుల్లో కూడా అసూయ ద్వేషాలు పెరిగాయని సీట్ల ప్రకటనతో వెల్లడయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాలు, 290 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించింది. గతంలో ిలాంటి పరిణామాలు చోటు చేసుకున్న దాఖలాలు లేవు. అసంతృప్తి వాదులను బుజ్జగించడంలో విజయవంతం అయింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడంలో కూడా పెద్దగా సమస్యలకు తావులేని పద్ధతులను పాటించడంతో సమస్య సమసి పోయింది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో నిమగ్నం కాగా మహాకూటమి నాయకులు మాత్రం సీట్ల పంపకంలో సిగపట్లకు తెర దింపలేకపోతున్నారు. చివరికి డెడ్ లైన్లు కూడా పెట్టుకుంటున్నాయి.
Pages: 1 -2- News Posted: 31 March, 2009
|