విజయనగరంలో బొత్స హవా
విజయనగరం: విజయనగరం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడినవారు వేరే పార్టీల్లో చేరి టిక్కెట్లు సాధించడం, మరికొందరు అసంతృప్తితో పార్టీకి రాజీనామాలు చేయడం, ఇంకొందరు రెబెల్స్ గా నామినేషన్లు దాఖలు చేయడంలాంటి సంఘటనలు కోకొల్లలు. జిల్లా రాజకీయ ముఖచిత్రం రోజుకో విధంగా మారుతోంది. కురుపాం తెలుగుదేశం టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజుకు చుక్కందురుకావడంతో భంగపడి, పార్టీకి రాజీనామా చేసి వెంటనే ప్రజారాజ్యం పార్టీలో చేరి టిక్కెట్ సాధించారు. సాలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన గుమ్మడి సంధ్యారాణికాంగ్రెస్ కు ఉదయం రాజీనామా చేసి, సాయంత్రానికల్లా తెలుగుదేశంలో చేరి టిక్కెట్ తెచ్చుకున్నారు.
ఇక పార్టీ టిక్కెట్లు లభించక రెబెల్స్ గా నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ప్రజారాజ్యంలో ఎనిమిది మంది, కాంగ్రెస్ లో ఒకరు ఉన్నారు. సాలూరు నుంచి రాయల సుందరరావు, పార్వతీపురం నుంచి చిలకలపల్లి శాంతారావు, వేల్పుల విజయకుమార్, చీపురుపల్లి నుచి కెంబూరి రామ్మోహనరావు, గజపతినగరం నుంచి కొండపల్లి కొండలరావు, డోకుల అప్పలనాయుడు, ఎస్.కోట నుంచి టి.వరలక్ష్మి, నెల్లిమర్ల నుంచి తాళ్లపూడి సత్యనారాయణ ప్రజారాజ్యం పార్టీ రెబెల్స్ గా నామినేషన్లు వేశారు. ఎస్.కోట కాంగ్రెస్ టిక్కెట్ ను తొలుత జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఐ.రఘురాజుకు కేటాయించి మరుసటి రోజునేఆయన అభ్యర్ధిత్వాన్ని రద్దుచేయడంతో ఆయన కాంగ్రెస్ రెబెల్ గా బరిలో ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 2 April, 2009
|