మావోల మౌనం ఎందుకు?
హైదరాబాద్ : ఎన్నికలు జరగబోతున్నాయి. కాని మావోయిస్టుల మౌనమే దుర్భరంగా ఉన్నది. ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల పొడుగునా నక్సల్ ప్రాబల్యం ఉన్న జిల్లాలలో ఎకె-47 తుపాకులు మూగబోయాయి. కాని రాష్ట్ర పోలీసులు మాత్రం ఇది తుపాను ముందు ప్రశాంతతా అని ఆందోళన చెందుతున్నారు.
'ఈ అసాధారణ ప్రశాంతత విచిత్రంగా ఉంది. పోలీసులను దిగ్భ్రాంతి పరచడానికి, ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి మావోయిస్టులు దొంగ దెబ్బ తీయవచ్చు, ఉన్నట్లుండి దాడులు సాగించవచ్చు' ఆందోళనపూర్వక స్వరంతో పోలీసు అధికారి ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) ప్రతినిధితో అన్నారు. ఒరిస్సా సరిహద్దులోని 10 నుంచి 15 అసెంబ్లీ నియోజకవర్గాలలోను, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాలలోను, మూడు రాష్ట్రాలతో సరిహద్దులు గల తెలంగాణ ప్రాంతంలో దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలలోను మావోయిస్టులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తున్నది.
మావోయిస్ట్ యాక్షన్ బృందాలు ఈ దఫా నిర్దుష్ట లక్ష్యాలపై గురి పెట్టవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. సాయుధ తీవ్రవాదులు కంపెనీలలో సంచరిస్తున్నట్లు సమాచారం. (ఒక్కొక్క కంపెనీలో 90 మంది నుంచి 100 మంది వరకు సభ్యులు ఉంటారు). డిఐజి స్థాయి అధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, భీతాహం సృష్టించి, తమ ఉనికి చాటుకోవడానికి వారికి ఎన్నికలు ఒక మార్గం అని అన్నారు. 'ఎక్కడ దాడిచేస్తే దారుణమైన ప్రభావం ఉంటుందో అక్కడ వారు వ్యూహాత్మకంగా దాడికి పూనుకోవచ్చు' అని ఒక నిపుణుడు సూచించారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగియడంతో మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు అంతరాయం కలిగించాలనే పట్టుదలతో ఉంటుండవచ్చునని పోలీసు వర్గాలు సూచించాయి. 'కల్లోలం సృష్టించడానికి ఖమ్మం-ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టులు రెగ్యులర్ గా సమావేశాలు జరుపుతున్నట్లు మాకు నిర్దుష్టంగా సమాచారం అందింది' అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 4 April, 2009
|