పోటీ తీవ్రం, ప్రచారం ఉధృతం
హైదరాబాద్: తొలి విడత ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరం అయింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికారం నిలబెట్టికోవాలనుకుంటున్న కాంగ్రెస్ కు, మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న తెలుదేశం పార్టీకి, మార్పు నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రజారాజ్యం పార్టీకి తొలిదశ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాదించడం కీలకం కానున్నది. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి తెలంగాణలో కాంగ్రెస్, మహాకూటమి మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతుందని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. తెలంగామలో 119, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో తొలివిడత ఎన్నికలు జరుగనున్నాయి.
కిందటిసారి ఎన్నికల్లో తెలంగాణలో 107 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండగా ఇప్పుడవి 119కి పెరిగాయి. అయితే ఉత్తరాంధ్రలో గల 37 అసెంబ్లీ స్థానాలు 34కు తగ్గాయి. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి బలంగా వున్న తెలంగాణలో తెలుగుదేశం సాధించే స్థానాలపైనే అధికారంలోకి రావడం ఆధారపడి ఉంది. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణపై ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తోంది. అందువల్లనే అక్కడ ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలంగాణలో ప్రజారాజ్యం విజయావకాసాలు తక్కువగా ఉన్నప్పటికీ ఆ పార్టీ చీల్చే ఓట్లను బట్టి మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మహాకూటమి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
Pages: 1 -2- News Posted: 5 April, 2009
|