స్థానికులు దక్కించుకుంటారా?
విశాఖపట్నం: విశాఖ పార్లమెంటు స్థానానికి నలుగురు ప్రముఖ అభ్యర్ధులు పోటీలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యే పోటీ ప్రధానంగా జరగనుంది. విశాక ఎంపిగా స్థానికేతరులే ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి అదే ఆనవాయితీ కొనసాగుతుందో లేక స్థానికులే గెలుపొందుతారో ఓటర్లే నిర్ణయించాలి. ఈ నియోజకవర్గంలో స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందరీశ్వరి కాంగ్రెస్ అభ్యర్దిగా, ఎంవివిఎస్ మూర్తి తెలుగుదేశం తరఫున, మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు బిజెపి తరఫున, బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా శ్రీనివాస్ ప్రజారాజ్యం అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో వున్న విశాక స్థానాన్ని కాపాడుకోడానికి ఆ పార్టీ, మళ్లీ కైవసం చేసుకోడానికి తెలుగుదేశం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నాయి. స్థానిక నినాదంతో తెరమీదకు వచ్చిన డివి సుబ్బారావు, అదే నినాదంతో పాటు సామాజికవర్గం మద్దతుతో పల్లా శ్రీను ఈ సీటును దక్కించుకోడానికి కృషి చేస్తున్నారు.
ెన్టీఆర్ కుమార్తెగా దగ్గుబాటి పురందరీశ్వరిని ఈ నియోజకవర్గం ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో గట్టి ఎమ్మెల్యే అభ్యర్ధులు కావాలని ఆమె పట్టు పట్టినా, అధిష్టానం ముందుగా ప్రకటించిన జాబితాలో ఏ మాత్రం మార్పు చేయలేదు. అయినప్పటికీ గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని కాంగ్రెస్ నాయకులంతా ఐకమత్యంగా ఆమె వెంట ఉన్నారు. ఇంతకు మునుపు ఎంపి నేదురుమల్లి జనార్దనరెడ్డి నియోజకవర్గ ప్రజలకు దూరంగా ున్నారన్న ఆరోపణలతో పాటు అధిక ధరలు, కార్పొరేషన్ వైఫల్యాలను ప్రతిపక్షాలు అస్త్రాలుగా సంధిస్తున్నాయి. వీటి గురించి పురందరీశ్వరి ఏ మాత్రం ప్రస్తావించకుండా, రాజశేఖరరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 5 April, 2009
|