మళ్లీ తప్పని తిరుగు'పోటు'!
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు రెండోవిడత ఎన్నికల్లో కూడా రెబెల్స్ బెడద తప్పలేదు.తొలవిడత ఎన్నికలతో పోలిస్తే ఇది కాస్త తక్కువే! తెలుగుదేశం పార్టీ కంటె కాగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లోనే ఈసారి తిరుగుబాటు అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో వున్నారు. రెండోవిడత ఎన్నికలు కోస్తా, రాయలసీమల్లోని 20 లోక్ సభ, 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగనున్నాయి. గ్రూపు రాజకీయాలకు పేరు పొందిన నెల్లూరు జిల్లాలో ఏ పార్టీకి తిరుగుబాటు అభ్యర్ధుల బెడద లేకపోవడం విశేషం. ప్రకాసం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్ధి బాల వీరాంజనేయులుపై రెబెల్ అభ్యర్ధిగా టి.నిర్మల పోటీలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల రెబెల్స్ ఉన్నా, అధికారిక అభ్యర్ధులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలైన సిపిఐ, సిపిఎం అభ్యర్ధులిద్దరూ పోటీలో వున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పోటీ చేస్తున్న నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుబాటు అభ్యర్ధిగా బిసి నాయకుడు రాజా కాశయ్య పోటీలో ఉన్నారు. బాపట్లలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిపై తిరుగుబాటు అభ్యర్ధి కోన రఘుపతి, పెదకూరపాడులో తెలుగుదేశం అభ్యర్ధి కొమ్మలపాటి శ్రీధర్ పై రెబెల్ గా నూతలపాటి హనమయ్య, మాచర్లలో ప్రజారాజ్యం అభ్యర్ధి మాగంటి సుదాకర్ పై దామిశెట్టి నరేంద్ర, తిలకలూరిపేట ప్రజారాజ్యం అభ్యర్ధి సినీ దర్శకుడు పోసాని కృష్ణ మురళిపై తిరుగుబాటు అభ్యర్ధి డాక్టర్ అనిఫ్ పోటీలే ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 9 April, 2009
|