పార్టీలకు ప్రతిష్టాత్మకం!
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పునర్విభజనలో భాగంగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కలిశాయి. కొత్తగా గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలు చేరాయి. కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్ధి కదిరి బాబూరావు నామినేషన్ ను అధికారులు తిరస్కరించడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూల వాతావరణ ఏర్పడింది. ఈ నియోజకవర్గం కూడా ఒంగోలు పార్లమెంటు స్థానం పరిధిలో ఉండడంతో మాగుంటకు కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలవారు అంటున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మరోసారి బరిలో నిలవగా, తెలుగుదేశ్ అబ్యర్ధి ఎం.ఎం.కొండయ్య కొత్తగా తెరపైకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి పిడతల సాయికల్పనా రెడ్డి తొలిసారిగా పార్లమెంటుకు పోటీలో ఉన్నారు.
ఈ త్రిముఖ పోటీలే విజయం ఎవరిని వరిస్తుందో, ఓటరు నాడి అందని పరిస్థితిలో నియోజకవర్గ సమీకరణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ఎక్కువ విజయావకాశాలు వున్నాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. దశాబ్దకాలంగా మాగుంట కుటుంబంపట్ల జిల్లా ప్రజలకు గల ఆదరాభిమానాలు తమను గెలిపిస్తాయని మాగుంట వర్గీయులు చెబుతున్నారు. ఇటీవలి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో మనస్పర్ధలు ఉన్నప్పటికీఅవి శాశ్వతం కాదని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. అయితే బాలినేనికి అండగా నిలబడ్డ కొందరు ద్వితీయశ్రేణి నాయకులు ఎన్నికల సమయంలో మాగుంట పక్షాన చేరారు. మాగుంట సుబ్బరామరెడ్డి మరణానంతరం రాజకీయ వారసత్వం పొందిన ఆయన కుటుంబం ఆయన అనుసరించిన పంథానే అనుసరిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 9 April, 2009
|